అనుకోని వివాహం

విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి
చెట్టు వద్దకు వెళ్లి, శవాన్ని దించి భుజాన
వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం
కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని
బేతాళుడు, “రాజా, ‘ఈ అపరాత్రివేళ
మరొకరి కోసం నీవీ విధంగా శ్రమపడు
తున్నావంటే ఇందుకు తగిన కారణం నీ
పూర్వజన్మలో ఏదో ఉండేఉంటుంది.
పూర్వజన్మ కారణంగానే కదా సుప్రహరు
డనే పల్లెవాడు రాజకుమా ర్తెను ప్రేమించి,
ఆ కారణంగా ప్రాణాలు కూడా వదిలాడు!-
నీకు శ్రమ తెలియకుండా ఉండగలందు
లకు ఆ కథ చెబుతాను విను,” అంటూ
ఈ విధంగా చెప్పసాగాడు :
పూర్వం రాజగృహమనే నగరాన్ని
మలయసింహుడనే రాజు పాలిస్తూ ఉండే
వాడు. ఆ రాజుకు మాయావతి
అని అసాధారణ రూపవతి అయిన కుమార్తె
ఉండేది.

ఒకనాడు మాయావతి పూలతోటలో
విహరిస్తూ ఉండగా సుప్రహరుడనే యువ
కుడు చూసి మోహించాడు. సుప్రహరుడు
కావటానికి అందగాడూ, యువకుడూ –
కాని చేపలుపట్టి జీవించే పల్లెవాడు. తాను
అతి తక్కువ తరగతికి చెందిన పల్లెవాణ్ణునీ,
రాజకుమార్తెపై తనకు పుట్టిన మోహం
సఫలం కావటం అసంభవమని అలోచించ
కుండా, వాడు మాయవతి కోసం మనోవ్యాధి
పడి పోసాగాడు. ఈ మనోవ్యాధితో వాడు
చేపలు పట్టటానికి వెళ్లటం మానుకున్నాడు,
తిండి తినటంకూడా మానేసి బెంగలో
ముణిగిపోయాడు.
చూసి చూసి, తల్లి వాణ్ణి ప్రశ్నించి,
జరిగిన సంగతి ఉన్నదున్నట్టు తెలుసు
కున్నది. అంతా విని ఆమె తన కొడుకుతో,
‘ఈ భాగ్యానికే విచారం దేనికిరా, నాయనా?
అన్నను నీ కోరిక తీరే ఉపాయం
నేను చూస్తాను,” అన్నది.
TE
ఈ మాటలకే సుప్రహరుడు దిగులు తీరి,
లేచి అన్నం తిన్నాడు.
తరువాత వాడి తల్లి మంచి మంచి చేప
లను తీసుకుని రాజుగారి ఇంటికి పోయి,
రాజకుమార్తెను చూడ వచ్చానని దాసీల
చేత కబురు పంపింది. రాజకుమార్తె
ఆమెను లోపలికి రానిచ్చింది. పల్లెవాడి
తల్లి మాయావతికి తాను తెచ్చిన చేపలు
కానుక పెట్టి వెళ్లిపోయింది.
అదిమొదలు ఆ మనిషి ప్రతిరోజూ రాజ
కుమార్తెకు మేలురకం చేపలు తెచ్చి
కానుక ఇస్తూ వచ్చింది. ఈ విధంగా కొన్ని
రోజులు గడిచాక మాయావతి ఆమెతో,
“ఏదో కోరిక మనసులో ఉంచుకుని
ఓపికగా రోజూ నాకు చేపలు తెచ్చి ఇస్తు
న్నావు. నీ కోరిక ఏమిటో చెప్పు. కష్టసాధ్య
మయినా తీరుస్తాను,” అన్నది.
” అభయం ఇస్తే నా కోరిక రహస్యంగా
చెబుతాను,” అన్నది పల్లెవాడి తల్లి.

మాయాపతి అభయమిచ్చి, దగ్గిర
ఎవరూ లేకుండా అందరినీ పంపేసినాక
ఆమె రాజకుమా ర్తెతో, ” అమ్మా, నా కొడుకు
ఒకనాడు నిన్ను పూలతోటలో చూశాట్ట.
అదిమొదలు వాడు నీమీది ప్రేమతో పరిత
పించి పోతున్నాడు. ఒక్కసారి నీవు వాణ్ణి
చేత్తో తాకితే తప్ప వాడి ప్రాణాలు నిలిచే
టట్టు లేదు,” అన్నది.
ఈ మాటలు విని మాయావతి చాలా
సిగ్గు పడింది. కాని కోరిక తీరుస్తానని మాట
ఇచ్చింది గనక, “సరే, రాత్రివేళ రహస్యంగా
నీ కొడుకును నా మందిరానికి తీసుకురా!
అతణ్ణి తాకి తావశాంతి చేస్తాను,” అన్నది.
పల్లెవాడి తల్లి పరమానంద భరితురాలై
ఇంటికి వెళ్ళి, ఆ రాత్రి తన కొడుకును
తనకు చాతనయినంతబాగా అలంకరించి,
రహస్యంగా మాయావతి ఇంటికి చేర్చింది.
మాయావతి సుప్రహరుణ్ణి ఒక మంచం.
మీద పడుకోబెట్టి, చల్లని తన చేత్తో వాడి
శరీరాన్ని నిమిరింది. ఆ స్పర్శకు వాడు సుఖ
సముద్రంలో ముణిగిపోయి వెంటనే నిద్ర
పోయాడు. వాడు నిద్రపోయాడని తెలియ
గానే మాయావతి తన పడకగదిలోకి వెళ్లి
నిశ్చింతగా నిద్రపోయింది.
ఆమె తన శరీరం మీది నుంచి చెయ్యి
తీయగానే సుప్రహరుడు నిద్రలేచి చుట్టూ
చూశాడు. మాయాపతి కనిపించలేదు.
తాను ప్రేమించిన మనిషి దొరికినట్టే దొరికి
అంతలోనే మాయమయేసరికి గుండె పగిలి
వాడు ఆ క్షణంలోనే ప్రాణాలు వదిలాడు.
ఈ సంగతి తెలియగానే మాయావతి
తన తండ్రికి జరిగినదంతా చెప్పి సుప్ర
హరుడితోబాటు సహగమనం చేస్తానని చెప్పే
సింది. తండ్రి ఎన్నో విధాల చెప్పిచూశాడు,
కాని ఆమె తన ఉద్దేశాన్ని మార్చుకో లేదు.
ఏమి చెయ్యటానికి పాలుబోక రాజు
శుద్దుడై, ఆచమనం చేసి, తన ఇష్టదైవమైన
శంకరుణ్ణి ధ్యానించి, “ఇంత ఘోరపరిస్థితి

ఎలా ఏర్పడింది? ఈ పరిస్థితిలో నేనేం
చెయ్యాలి?” అని ఆక్రోశించాడు.
ఆయన ప్రశ్నకు అశరీరవాణి
సమాధాన మిచ్చింది :
“రాజా, నీ కూతురు క్రిందటి జన్మలో
ఈ పల్లెవాడికి భార్య. ఆ జన్మలో ఈ పల్లె
వాడు జలధరుడనే బ్రాహ్మడు. అతని
తండ్రి చనిపోగానే అతని ఆస్తి అంతా
దాయాదులు దోచుకున్నారు. దానితో
ఆ జలధరుడికి వైరాగ్యం వచ్చింది. అతను
తన భార్యతో సహా గంగా తీరానికి వచ్చి
అక్కడ ప్రాయోపవేశం చేసి నిరాహారదీక్ష
పట్టాడు. ఆకలితో మలమలలాడే బ్రాహ్మ
డికి గంగాతీరాన చేపలు తింటున్న పల్లె
వాళ్ళు కనిపించేసరికి మనసు చలించింది.
ఆ దోషంచేత అతను ప్రాణాలు పోయాక
పల్లెవాళ్ళ మధ్య తిరిగి జన్మ ఎత్తాడు. అతని
భార్యమాత్రం పవిత్ర హృదయంతో భర్తతో
సహగమనం చేసింది. అందుచేత ఆమె ఈ
జన్మలో నీ కుమార్తెగా జన్మించింది.
ఇప్పుడు కలిగిన విపత్తు తొలగాలంటే నీ
కుమార్తె తన ఆయుర్దాయంలో సగం ఆ
పల్లెవాడి కిచ్చి అతన్ని పెళ్ళాడటానికి ఒప్పు
కున్నట్టయితే వాడు బతుకుతాడు.”
తన కుమార్తె చావకుండా ఉంటే అంతే
చాలు ననుకుని రాజు మాయావతితో,

“అమ్మా, నీవు సహగమనం చేయవలిసిన
పనిలేదు. ఈ పల్లె యువకుణ్ణి పెళ్ళాడి నీ
ఆయుర్దాయంలో అతడికి సగం ఇవ్వటానికి
సిద్ధపడితే అతను బతుకుతాడు,” అని
చెప్పాడు. మాయావతి ఆ విధంగానే చేసి
సుప్రహరుణ్ణి బతికించుకుని, అతన్ని పెళ్లి
ఉంది. ఆ తరువాత సుప్రహరుడు ఆ దేశానికి
రాజై భార్యతో సుఖంగా జీవించాడు.
బేతాళుడి కథ చెప్పి, ” రాజా, నా కొక్క
సందేహం. మాయావతి పల్లెయువకుష్టు
తాకి నిద్రపుచ్చేవరకూ ఆమె తాను ఇచ్చిన
మాట నిలబెట్టుకోవటానికే ప్రయత్నించింది.
అలాటి మనిషి వాడు పోగానే వాడితో సహగ
మనం చెయ్యటానికి ఎందుకు ప్రయత్నిం
చింది? వాడిమీది ప్రేమచేతనా? లేక, వాడి
చావుకు తానే కారణమనా? లేక, పూర్వ
జన్మలో వాడి భార్య కావటంచేతనా ? దీనికి
సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో
నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “మాయావతి
సుప్రహరుడు జీవించి ఉండగానే అతన్ని
తన భర్తగా భావించిందనటానికి సందేహం
లేదు. కేవలం పూర్వజన్మ ప్రభావంవల్ల
ఆమె వాణ్ణి భర్తగా వరించినట్టయితే వాడు
నిద్రపోగానే తన గదికి వెళ్లిపోయి వాడి
చావుకు తాను కారణం కానవసరం లేదు.
అచ్చగా అన్నమాట నిలబెట్టుకోవటానికే
అయితే ఆమె వాణ్ణి తాకి తాపం తీర్చిన
మీదట వాడు ఏమైనా ఆమె పూచీ ఏమీ
ఉండదు. వాణ్ణి ప్రాణాలతో ఉండగా
ప్రేమించి వాడే తన భర్త అని నిర్ణయించు
కున్నది గనకనే ఆమె వాడితో సహగమనం
చేయ నిశ్చయించింది. అందుకే వాడికి తన
ఆయుర్దాయంలో సగమిచ్చి, వాళ్లు పెళ్ళాడ
టానికికూడా ఒప్పుకున్నది,” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ
గానే బేతాళుడు శవంతో సహా మాయమై
మళ్లీ చెట్టెక్కాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *